తన అభిమానులకు స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. నయనతారను ఆమె అభిమానులంతా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. అయితే దయచేసి తనను అలా పిలవద్దని హీరోయిన్ కోరింది. అలా పిలుస్తుంటే ఆనందంగా ఉన్నా.. తన మనసుకు నచ్చిన పేరు మాత్రం ‘నయనతార’ అని చెప్పింది. సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌కు నయన్ ఈ రిక్వెస్ట్ చేసింది. నయనతార అనే పేరు ఒక నటిగానే కాకుండా వ్యక్తిగా కూడా తనేంటో తెలియజేస్తుందని చెప్పుకొచ్చింది.
‘‘మీరు చూపే అభిమనానికి కృతజ్ఞరాలిని. నా జీవితం తెరిచిన పుస్తకం. నా సక్సెస్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కష్ట సమయంలో మీరు నాకు ఎంతో అండగా ఉన్నారు. మీరెంతో ప్రేమతో నాకిచ్చిన బిరుదు లేడీ సూపర్ స్టార్ బరుదు. అందుకు నేను రుణపడి ఉంటా. కానీ నన్ను నయనతార అని పిలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. లేడీ సూపర్ స్టార్(Lady Superstar) లాంటి బిరుదులు వెలకట్టలేనివి. వాటివల్ల కంఫర్ట్ ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది. సినిమా మనందరినీ ఐక్యంగా ఉంచుతుంది. దాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుందాం’’అని నయన్(Nayanthara) తన పోస్ట్‌లో తెలిసింది.