Nayanthara | నన్ను అలా పిలవద్దు.. అభిమానులకు నయనతార రిక్వెస్ట్

-

తన అభిమానులకు స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. నయనతారను ఆమె అభిమానులంతా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. అయితే దయచేసి తనను అలా పిలవద్దని హీరోయిన్ కోరింది. అలా పిలుస్తుంటే ఆనందంగా ఉన్నా.. తన మనసుకు నచ్చిన పేరు మాత్రం ‘నయనతార’ అని చెప్పింది. సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌కు నయన్ ఈ రిక్వెస్ట్ చేసింది. నయనతార అనే పేరు ఒక నటిగానే కాకుండా వ్యక్తిగా కూడా తనేంటో తెలియజేస్తుందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

‘‘మీరు చూపే అభిమనానికి కృతజ్ఞరాలిని. నా జీవితం తెరిచిన పుస్తకం. నా సక్సెస్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కష్ట సమయంలో మీరు నాకు ఎంతో అండగా ఉన్నారు. మీరెంతో ప్రేమతో నాకిచ్చిన బిరుదు లేడీ సూపర్ స్టార్ బరుదు. అందుకు నేను రుణపడి ఉంటా. కానీ నన్ను నయనతార అని పిలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. లేడీ సూపర్ స్టార్(Lady Superstar) లాంటి బిరుదులు వెలకట్టలేనివి. వాటివల్ల కంఫర్ట్‌ ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది. సినిమా మనందరినీ ఐక్యంగా ఉంచుతుంది. దాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుందాం’’అని నయన్(Nayanthara) తన పోస్ట్‌లో తెలిసింది.

Read Also: గాయని కల్పన ఆత్మహత్యాయత్నం
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kodali Nani | మాజీమంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని(Kodali Nani)...

Manoj Bharathiraja | ప్రముఖ నటుడు, భారతీ రాజా కుమారుడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కుమారుడు.. తమిళ నటుడు, చిత్రనిర్మాత మనోజ్...