అందంగా కనిపించాలని.. ఇంకా అందంగా కనిపించాలని హీరోయిన్‌లు చాలా మంది సర్జరీలు(Surgeries) చేయించుకుంటూ ఉంటారు. అదే విధంగా నయనతార(Nayanthara) కూడా తన మొఖానికి సర్జరీ చేయించుకుందంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. టాలీవుడ్, కోలీవుడ్ సహా బాలీవుడ్‌లో తన మార్క్ చూపించుకోవాలన్న ఉద్దేశంతోనే నయనతార ఈ సర్జరీ చేయించుకుందని కూడా ఒక వాదన ఉంది. తాజాగా ఈ సర్జరీ వార్తలపై నయనతార ఘాటుగా స్పందించింది. తన మొఖాన్ని మార్చుకోవాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఆ ఆలోచన కలలో కూడా చేయలేదని చెప్పింది. అలా ప్రయత్నాలు కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదని తెలిపింది.
‘‘నా కనుబొమ్మలంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారాన్ని మాత్రం ఎప్పుడూ మారుస్తూ ఉంటా. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్ ముందు వాటిని మారుస్తుంటా. వాటిపై ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటా. అవి మారినప్పుడల్లా నా మొఖంలో కూడా మార్పు కనిపిస్తుంది. అందుకే నా మొఖంలో మార్పులు వచ్చాయని, సర్జరీలు చేయించుకున్నానని ప్రజలు అనుకున్నారేమో. కానీ వాటిలో వాస్తవం లేదు. అదే విధంగా డైటింగ్ వల్ల కూడా నా మొఖంలో మార్పులు రావొచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు కనిపిస్తాయి. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ అనేది ఉండదు’’ అని నయన తార(Nayanthara) స్పష్టం చేసింది.
Read Also: టాలీవుడ్ హీరోల గురించి సూర్య ఏమన్నారంటే..