అక్కినేని వారసుడు అయిన యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలిసి “సవ్యసాచి” అనే సినిమాలో నటించింది నిధి అగర్వాల్. తెలుగు లో ఈ అమ్మాయికి ఇది మొదటి సినిమా అయిన కూడా హిందీ లో మాత్రం నిధి అగర్వాల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. గతేడాది “మున్నా మైఖేల్” చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. నిన్న రిలీజ్ అయిన “సవ్యసాచి” సినిమాలో నిధి అగర్వాల్ ని చూసి తెలుగు యువత మొత్తం ఆమె మీద మనసుపారేసుకుంది అని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో తన పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చగా డాన్స్ అభినయంతో సినిమాలో తనే హైలైట్ గా నిలిచింది. తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఇప్పుడే అన్నతో కలిస్ నటించిన ఈ భామ ఇప్పుడు తమ్ముడు అఖిల్ అక్కినేనితో కలిసి “మిస్టర్ మజ్ను” లో కలిసి నటిస్తుంది. వరుసగా ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలు చేస్తున్న ఈ అక్కినేని వారి భామ కి ఇతర హీరోల సినిమా హీరోల దగ్గరనుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. మరి ఇప్పుడిపుడే తన అందం తో అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ ఇక ముందు ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.
ఒక్క సినిమా తో నిధి కి వరుస ఆఫర్స్
ఒక్క సినిమా తో నిధి కి వరుస ఆఫర్స్