ఇటీవల తనకు కరోనా సోకింది అనే విషయాన్ని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి, అయితే మళ్లీ తనకు కరోనా నెగిటీవ్ వచ్చింది అని రెండు రోజుల తర్వాత తెలిపారు, దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు, మెగా కుటుంబం ఫ్యాన్స్ ఆనందించారు, మరీ ముఖ్యంగా టెస్ట్ కిట్ ఫెయిల్ వల్ల ఇలాంటి పరిస్దితి వచ్చింది. రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆయన టెస్ట్ చేయించుకుంటే ఆయనకు నెగిటీవ్ గా వచ్చింది.
ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఒక్కసారి పాజిటివ్ అని వచ్చి తిరిగి నెగిటివ్ వచ్చినా తప్పనిసరిగా క్వారంటైన్ లో చిరంజీవి ఉండాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మిగిలిన వారికి కూడా ఎఫెక్ట్ ఉండదు అంటున్నారు, అంతేకాదు వారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి ఇలాంటి విధానం తీసుకువచ్చింది కేంద్రం.
అందుకే ఇలా టెస్టులు చేయించుకున్న వారు పాజిటీవ్ నుంచి నెగిటీవ్ వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి అని అంటున్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం చిరంజీవి క్వారంటైన్ లో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీపావళి సందర్భంగా మెగాస్టార్ తన గురువు అయిన కళాతపస్వి కె విశ్వనాథ్ ను కలిశారు. ఈ సమయంలో ఆయన ఆశీస్సులు పొందారు మెగా స్టార్ చిరంజీవి.