నేహాశర్మ రియల్ స్టోరీ – ఆమె తండ్రి ఎవరో తెలుసా

నేహాశర్మ రియల్ స్టోరీ - ఆమె తండ్రి ఎవరో తెలుసా

0
77

తెలుగులో కొన్ని చిత్రాలు మాత్రమే చేసింది అందాల తార నేహాశర్మ…చిరుత సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది, మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం..నేహా శర్మ21 నవంబరు 1987 న పుట్టింది. భగల్పూర్, బిహార్ ఆమె సొంత స్టేట్..

నటిగా మోడల్ గా నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుత లో రాం చరణ్ సరసన నటించింది..2007 లో ఆమె సినిమాలో నటించింది. తర్వాత కుర్రాడు సినిమాలో కూడా నటించారు. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. అయితే ఆమె కుటుంబం గురించి చూస్తే.

 

ఆమె తండ్రి అజిత్ శర్మ ఒక వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. భగల్పుర్ కి MLA గా ఎన్నిక అయ్యారు. నేహా శర్మ బీహార్ లోని మౌంట్ కర్మెల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసింది.. ఆ తర్వాత న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసింది.

 

ఆమెకి నటన అంటే చిన్నతనం నుంచి ఇష్టం, అలా మోడల్ రంగం నుంచి చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది.

2007 లో చిరుత

2009 లో కుర్రాడు సినిమాల్లో నటించింది. ఇక ఎక్కువ ఆమె హిందీ చిత్రాల్లోనే నటించింది.