నేను చనిపోవాల్సింది డైరెక్టర్ శంకర్ సంచలన పోస్ట్

నేను చనిపోవాల్సింది డైరెక్టర్ శంకర్ సంచలన పోస్ట్

0
109

దర్శకుడు శంకర్ ఎంతో బాధ్యతగా భారతీయుడు సినిమా2 తెరకెక్కిస్తున్నారు, ఈ సమయంలో విషాద వార్తగా ఆ సెట్ లో క్రేన్ ప్రమాదం జరిగింది, 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ పడింది.. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు.దర్శకుడు శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు . అలాగే శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కూడా అక్కడే చనిపోయారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసాడు. వెంటనే రాత్రికి రాత్రి అక్కడకు కమల్ హసన్ వెళ్లి అక్కడ సహయసహకారాలు అందించారు,

అంతేకాదు ప్రమాదంలో చనిపోయిన వారికి కోటిరూపాయలు సాయం ప్రకటించారు, తాజాగా దర్శకుడు శంకర్ దీనిపై చాలా బాధతో ఓ పోస్టు పెట్టారు…ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ తన కళ్లలోనే ఉందని.. ఆ రోజు నుంచి నిద్ర కూడా రావడం లేదని ఇలాంటిది జరుగుతుంది అని కలలో కూడా అనుకోలేదు అని అన్నాడు.

తన అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మరణం తనను కలిచివేసిందని .. ఆ రోజు ఆ క్రేన్ తనపై పడినా బాగుండేదని.. తాను చనిపోయినా బాగుండేదని సంచలన పోస్ట్ చేసాడు దర్శకుడు శంకర్.. అయితే దీనిపై అభిమానులు సార్ దారుణం జరిగింది వారి కుటుంబానికి ఆసరాగా ఉండండి …మీ బాధ అర్దం అవుతోంది ఈ చిత్రం పూర్తి చేసి వారికి అంకితం చేయండి సార్ అని అభిమానులు చెబుతున్నారు.