నిరుపేద యువతిని డాక్టర్ చేసిన హీరో….ఎవరంటే

నిరుపేద యువతిని డాక్టర్ చేసిన హీరో....ఎవరంటే

0
112

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన తమిళ హీరో శివకార్తికేయన్…తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కౌసల్యా కృష్ణమూర్తి సినిమా తో మెప్పించి మరింత దగ్గరయ్యారు. ప్రతిభావంతురాలైన విద్యార్థిని చదివిస్తూ రీల్ హీరో రియల్ హీరో అయ్యాడు.

వివరాల్లోకి వెళితే…తంజావూరు జిల్లా సమీపంలో ఉండే ఓ చిన్న పల్లెకు చెందిన గణేశన్ చిత్రాల సంతానం సహానా… గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్లస్ టూ వరకు చదువుకుంది. ప్లస్ టూలో 600 మార్కులకుగానూ 524 మార్కులు సాధించింది. మీడియా ద్వారా తనకు డాక్టర్ కావాలని కోరిక ఉన్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన శివకార్తికేయన్ ఆమెను చదివించేందుకు ముందుకొచ్చారు.

సహానాను తంజావూరులోని నీట్ కళాశాలలో ఆర్థిక సహాయంతో ఎంబీబీఎస్ సీటు కోసం శిక్షణ ఇప్పించారు. నీట్ పరీక్ష రాసిన సుహానా 273 మార్కులు సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకుంది. డాక్టర్ కావాలని తన కళ్ళని నెరవేర్చినందుకు శివకార్తికేయన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె ఆనందం వ్యక్తపరిచింది. ఒక నిరుపేద డాక్టర్ కావాలని సాయంగా నిలిచిన శివ కార్తికేయన్ రియల్ హీరో అంటూ ఆనందం వ్యక్తపరిచారు.