Salaar OTT | బాహుబలి సినిమాల తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్‌కు ‘సలార్’ రూపంలో దక్కిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ అందుకుంది. దీంతో వసూళ్ల సునామీ వచ్చింది మూవీకి. ఇప్పటివరకు రూ.715కోట్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. మూవీలో ప్రభాస్ చూపించిన హీరోయిజానికి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చాయి. ఇప్పటికీ మూవీ పలు థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ సడెన్ షాక్ ఇచ్చింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించేసింది.
Salaar OTT | రేపు అంటే జనవరి 20 నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మూవీ విడుదలైన నెల రోజులు కాకుండానే స్ట్రీమింగ్ చేయడం ఏంటని షాక్‌కు గురవుతున్నారు. అయితే ముందుగా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. హిందీలో కొన్ని రోజుల తర్వాత రిలీజ్ అవుతుందని సమాచారం. ఇటీవల ఎంత పెద్ద హిట్ అయిన సినిమాలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇదే బాటలో సలార్ కూడా వచ్చేస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్లు కుటుంబసమేతంగా ఇంట్లోనే మూవీ చూసి ఎంజాయ్ చేసేయండి.