దీపిక పదుకొణె(Deepika Padukone), రన్‌వీర్ సింగ్(Ranveer Singh) జంట ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ ఆనందాన్ని వారికి నెల రోజులైనా లేకుండా చేస్తున్నారు కొందరు. బిడ్డకు జన్మనివ్వడానికి ముందు దీపిక, రణ్‌వీర్ కలిసి ముంబైలోని సిద్ది వినాయక ఆలయాన్ని వెళ్లారు. ఇద్దరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లి వినాయకుడు దర్శనం చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా అంతా బాగానే ఉంది కానీ మెడలో తాళి బొట్టు ఏది? మొఖంపై బొట్టు ఏది? కనీసం ఇవి కూడా తెలియదా ఆమెకు? అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘‘కోట్లకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మీకు మంగళసూత్రం కొనుక్కునే స్థోమత లేకపోవడం బాధాకరం. పైగా తనిష్క్ నగల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి కూడా తాళిబొట్టు కొనుక్కోలేక పోయావా. సరే అన్ని చోట్ల తాళిబొట్టు తప్పనిసరి కాదనుకుందాం. గుడికి వెళ్లేటప్పుడు కనీసం మొఖానికి ఒక బొట్టు అయినా పెట్టుకోవాలని తెలియదా. భగవద్గీతను ముందు నువ్వు అర్థం చేసుకో.. ఆ తర్వాత పక్కవారికి నీతులు చెప్పు’’ అంటూ తిట్టిపోస్తున్నారు.
ఈ ట్రోలింగ్‌పై దీపిక(Deepika Padukone), రణ్‌వీర్‌ల అభిమానులు తెగ మండిపడుతున్నారు. దీపిక ఎలా ఉంటే మీకెందుకు అంటూ ట్రోలర్స్‌ను తిడుతున్నారు. ‘‘ఆమె ఎలా ఉండాలి? ఎలా కనిపించాలి? అనేది ఆమె ఇష్టం. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకు తల్లి. ఇలాంటి సమయంలో ఇలాంటి అనవసర డ్రామా చేస్తూ ఆమెను బాధపెట్టడం సరికాదు. సిద్ది వినాయక ఆలయంలో దర్శనం అనంతరం బొట్టు పెట్టుకునే బయటకు వచ్చింది కదా? అది మాత్రం మీ కళ్లకు కనిపించడం లేదా?’’ అంటూ మండిపడుతున్నారు.