నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నాగబాబు

నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నాగబాబు

0
82

ఈ రోజుల్లో సెలబ్రెటీలు హీరోలు హీరోయిన్లు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటున్నారు… నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు… ఇక అభిమానుల కోసం లైవ్ కు వస్తున్నారు… అయితే మెగా బ్రదర్ నాగబాబు అయితే మెగా హీరోలు అందరిలో కంటే ఆయన నెటిజన్లతో అభిమానులతో ఎక్కువగా సోషల్ మీడియాలో ముచ్చటిస్తారు, ఇక టీవీ షోలతో కూడా ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 

 

తాజాగా ఆయన ఇద్దరు నెటిజన్లకు ఇచ్చిన ఆన్సర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, చాలా మంది భలే సమాధానం చెప్పారు సార్ అంటున్నారు, ఓ వ్యక్తి నాగబాబుని ఉద్దేశించి నీకు ఎంత ఆస్తి ఉంది అని అడిగాడు. దీనికి ఆయన కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు, నన్ను నువ్వు అని సంబోధించావు గనుక నీకు రెస్పెక్ట్ తగ్గిపోయింది. అందువలన నీకు సమాధానం చెప్పను. మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగి ఉంటే నీకు సమాధానం వచ్చేది సగం ఆస్తి వచ్చేది అని చెప్పారు, తనదైన స్టైల్లో ఆయన సమాధానం ఇచ్చారు.

 

మీ ఇల్లు ఓ 50 కోట్లు ఉంటుందా అని మరో నెటిజన్ అడిగితే ముఖేశ్ అంబానీ ఇంటి కంటే ఓ పది రూపాయలు తక్కువ ఉంటుందని వెరైటీగా సమాధానం ఇచ్చారు….ఆయన సమాధానాలకు అభిమానులు సూపర్ అంటున్నారు.