యంగ్ టైగర్ ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ

యంగ్ టైగర్ ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ

0
83

ఈ మధ్య కాలం లో స్టార్ హీరో లఫ్యామిలీల నుండి చాల మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్నారు . ఇప్పటిదాకా ఈ విషయం లో మెగాఫ్యామిలీ ముందు వరసలో ఉంది .అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫామిలీ నుండి ఓ యువ హీరో రాబోతున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ..

ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి తమ్ముడు నితిన్ ఇప్పుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం .అయితే నితిన్ ఫాదర్ నార్నె శ్రీనివాసరావు ఈ మధ్య వైసీపీ లో చేరిన విషయం అందరికి తెలిసిందే .. రాజకీయానికి గ్లామర్ అవసరమన్న ఉద్దేశంతో కావాలని వారసుణ్ణి హీరో ను చేస్తున్నాడా లేక ఇది నితిన్ నిర్ణయమా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది ..

అయితే ఈ విషయం మన యంగ్ టైగర్ వరకు వెళ్లిందట .. కత్తిమీద సాము లాంటి ఈ ఇండస్ట్రీ లో కి రావడం ఈజీ బట్ గెలవడం చాల కష్టం అని ఎన్నో సార్లు చెప్పిన ఎన్టీఆర్ బామ్మర్ది విషయం లో ఎలా స్పందిస్తాడా అని అభిమానుల్లో ఆసక్తి మొదలయ్యింది .