ప్రియా వారియర్ కి తెలుగు లో బంపర్ ఆఫర్..!!

ప్రియాంక వారియర్ కి తెలుగు లో బంపర్ ఆఫర్..!!

0
117

మలయాళంలో ప్రియా వారియర్ చేసిన సినిమా, అక్కడే కాదు మిగతా భాషల్లోను ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలైన ఈ సినిమాకి, యూత్ నుంచి రెస్పాన్స్ కరువైంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు రాకపోవచ్చనే అంతా అనుకున్నారు. కానీ తాజాగా ప్రియా వారియర్ తెలుగులో ఒక ఛాన్స్ కొట్టేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా వారియర్ ను తీసుకున్నారని అంటున్నారు. ‘మనమంతా’ తరువాత చంద్రశేఖర్ యేలేటి నుంచి రానున్న సినిమా ఇదే. నితిన్ ‘భీష్మ’ పూర్తయిన తరువాత, చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టుకి సంబంధించిన క్లారిటీ రానుంది.