సినిమాలు చేయకుండా కొత్త అడుగులు వేస్తున్న నిహరిక

సినిమాలు చేయకుండా కొత్త అడుగులు వేస్తున్న నిహరిక

0
79

మెగా ఫ్యామిలీలో హీరోలే కాదు హీరోయిన్ కూడా ఉంది అని నిరూపించారు మెగా డాటర్ నిహారిక.. ఆమె చేసిన సినిమాలకు ఆమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందరిలో ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకుంటారు నిహారిక, బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నిహారిక, ఆ తరువాత తెలుగులో వెబ్ సిరీస్ ట్రెండ్ కి నాందీ పలికింది. ఆరోజుల్లో ఆవకాయ్ ముద్దపప్పు- నాన్న కూచీ వంటి వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది, తర్వాత సినిమాల్లోకి వచ్చింది. అన్నీ కొత్త కొత్త ప్రయత్నాలు చేసింది నిహారిక.

ప్రముఖ నిర్మాత యం.ఎస్. రాజు కొడుకు సరసన హ్యాపీ వెడ్డింగ్ … నాగశౌర్యతో కలిసి ఒక మనసు.. ఫైట్మాస్టర్ విజయ్ తనయుడితో కలిసి సూర్యకాంతం చిత్రాల్లో నటించింది. అయితే తనకు ఫేమ్ వచ్చింది కాని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అందుకే మళ్లీ తన బ్యాక్ డేస్ కు వెళ్లాలి అని అనుకుంటోంది, తనకు నచ్చిన, పేరు వచ్చిన వెబ్ సిరీస్ లు చేయాలనుకుంటోంది. తాజాగా మ్యాడ్ హౌజ్ పేరుతో ఓ వెబ్ సిరీస్ ని నిర్మించింది. మొత్తం 100 ఎపిసోడ్ లుగా రానున్న ఈ వెబ్ సిరీస్ లో నిహారిక కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి.
ఇద్దరు అమ్మాయిలు వుండే ఇంటికి యజమానిగా ఇందులో నిహారిక కనిపించనుందని వెబ్ సిరిస్ టాక్. దీనికోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు