OTT release: ఓటీటీలో సందడి చేయనున్న కొత్త సినిమాలు

-

OTT release: ఓటీటీలు, నెట్‌ వినియోగం పెరిగాక సినిమాను థియేటర్లలలో చూసే వాళ్లు ఈ మధ్యకాలంలో తక్కువయ్యారనే చెప్పుకోవాలి. ఇంటర్‌నెట్‌ వాడకం పెరగటం.. ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు వెళ్లటం తగ్గిందని చెప్పుకోవచ్చు. సినిమాలతో పాటు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల వేదికగా రిలీజ్‌ కావటంతో, యూత్‌ ఎక్కువుగా ఓటీటీలకు ఎట్రాక్ట్‌ అవుతున్నారు. కాగా, నేడు ఓటీటీలలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దాం.

- Advertisement -

నేనే వస్తున్నా: హీరో ధనుష్ డబుల్‌ రోల్‌ పోషించిన చిత్రం నేనే వస్తున్నా సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సంవత్సరాల గ్యాప్‌ అనంతరం సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించాడు. ఈ సినిమాకు కథను ధనుష్‌ స్వయంగా రాశాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిచాడు. ఇద్దరు కవలల్లో ఒకరు సాధారణంగా ఉంటే.. మరొకరు సైకోలా ఎలా మారాడు.. వారి మధ్య జరిగిన పరిణామాలు ఏమిటి అన్నదే సినిమా కథ. సెప్టెంబర్‌ 29న తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్‌ టాక్‌ వచ్చింది.

శభాష్‌ చంద్రబోస్‌: టీవీ గురించి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ.. ఆ తరువాత వారిద్దరూ ఎటువంటి ఛాలెంజ్‌లు చేసుకున్నారు.. ఆ ఛాలెంజ్‌లు వారు నిలబెట్టుకున్నారా లేదా అన్నదే శభాష్‌ చంద్రబోస్‌ సినిమా కథ. విష్ణు ఉన్నికృష్ణన్‌, జానీ ఆంటోనీ, ఇర్షాద్‌ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు వీసీ అభిలాష్‌ రచన, దర్శకత్వం వహించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనవి

Dubai Bling – ఇంగ్లిష్,‌ Earthstorm – ఇంగ్లిష్, ‌Daniel Spellbound – ఇంగ్లిష్, ‌Family Reunion Season 5 – ఇంగ్లిష్, Cici – టర్కీస్‌, ఇంగ్లిష్, ‌Romantic Killer – జపనీస్‌, Beyond the Universe – పోర్చుగీస్, Cemara’s Family 2 – ఇండోనేషియా
డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్:‌ Jhansi – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, Phoenix Rising – ఇంగ్లిష్, ‌38 at the Garden – ఇంగ్లిష్‌
సైనా ప్లే- Adiyaan – మలయాళం
అమెజాన్‌ ప్రైమ్‌- Where the Crawdads Sing – ఇంగ్లిష్‌
షామారో మీ- Leela Natwarlal Ni – గుజరాతీ,  సినిమాలు వెబ్‌ సిరీస్‌లు OTT release అవుతున్నాయి

Read also: Nanda Kumar:పూజల కోసమే ఫాంహౌస్‌కు వెళ్ళాం

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...