విజయ్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్..బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్!

New Year gift for Vijay fans..when is the best release?

0
88

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవలే మాస్టర్ గా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రానికి దీలిప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిని క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత బీస్ట్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. న్యూఇయర్ కానుకగా బీస్ట్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్.

బీస్ట్ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ విజయ్‏కు సంబంధించిన సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. షైన్ టామ్ చాక్, సెల్వరాఘవన్, యోగిబాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.