కొత్త ఏడాది రోజే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ..అధికారిక ప్రకటన అప్పుడే!

New Year is a festival for Prabhas fans..the official announcement is just then!

0
91

వరుస పాన్​ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్ మరో పాన్​ ఇండియా సినిమాను ఓకే చేశారని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​లో ఓ పాన్​ ఇండియా మూవీ చేయబోతున్నట్లు సమాచారం.

2022 జనవరి 1 ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారని వినికిడి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్​కు పండగే. ఈ చిత్రాన్ని బాలీవుడ్​ దర్శకుడు సిద్ధార్థ్​ ఆనంద్​ తెరకెక్కించనున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు కూడా ఈ డైరెక్టర్​తో డార్లింగ్​ మూవీ చేయబోతున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఎవరూ దీని గురించి మాట్లాడుకోలేదు.

ప్రభాస్​ ఇప్పటికే బీటౌన్​ దర్శకుడు ఓం రౌత్​తో ‘ఆదిపురుష్’ చేస్తున్నారు. దీంతో పాటే ‘సలార్’​, ‘ప్రాజెక్ట్​ కె’, ‘స్పిరిట్’​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన ‘రాధేశ్యామ్’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్​. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.