వెంకీ మామ సినిమాతో మంచి హిట్ సాధించారు వెంకటేష్. ఈ చిత్రం సక్సస్ అయి కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది .. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చింది.. ఇక భారీ విజయంతో తన తదుపరి చిత్రంపై ఆయన ఫోకస్ చేశారు. ఆయన తదుపరి సినిమాగా అసురన్ రీమేక్ రూపొందనుంది. అయితే వెంకీ కాస్త రెస్ట్ తీసుకుని ఫారెన్ ట్రిప్ వెళతారు అని అనుకున్నారు కాని ఆయన ఫారెన్ ట్రిప్ వెళ్లడం లేదు అని తెలుస్తోంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, జనవరి 2వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు రామానాయుడు స్టూడియోలో చకచకా జరిగిపోతున్నాయి. కేవలం పది రోజుల గ్యాప్ తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారట వెంకటేష్.
ఇక తాజాగా వేసే సెట్స్ లో ఆయన దాదాపు వారం రోజులు షూటింగ్ లో పాల్గొంటారట.. కీలక సీన్స్ అన్నీ అక్కడ షూట్ చేయనున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ నటులని సెలక్ట్ చేసుకున్నారు. త్వరలో చిత్ర యూనిట్ మొత్తం వివరాలు అన్నీ ప్రకటించనున్నారు, కొత్త ఏడాది వెంకీ కొత్త చిత్రం వెంటనే స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు అభిమానులు