స్టార్ హీరోతో రిలేషన్​లో నిధి అగర్వాల్.. త్వరలో పెళ్లి?

Nidhi Agarwal in a relationship with Star Hero .. to get married soon?

0
118

అందాల తార నిధి అగర్వాల్‌ సవ్యసాచి’ చిత్రంతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన కెరీర్ లో మంచి పాత్రలు ఉన్న సినిమాలనే చేయడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికే సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నిధి.

ప్రస్తుతం నిధి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో విజయం అందుకున్న తర్వాత నిధి అగర్వాల్‌కు కోలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. శింబు ‘ఈశ్వరన్‌’ సినిమాలో నిధి హీరోయిన్‌గా చేసింది. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ జంటకు సూపర్ ఫాలోయింగ్‌ పెరిగింది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారని.. తరచూ పలు పబ్లిక్‌ ప్రదేశాల్లో కలిసి కనిపిస్తున్నారని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ తరుణంలోనే తమ బంధంపై వస్తోన్న పుకార్లకు పుల్‌స్టాప్‌ చెప్పాలనే భావనలో నిధి-శింబు ఉన్నారని.. వీలైనంత త్వరగా వివాహం చేసుకోనున్నారని ప్రచారం కూడా సాగుతోంది.