మెగాడాటర్ నిహారికకు పెళ్లి సంబంధాలు -ఆ బిగ్ ఫ్యామిలీ ఎవరంటే

మెగాడాటర్ నిహారికకు పెళ్లి సంబంధాలు -ఆ బిగ్ ఫ్యామిలీ ఎవరంటే)

0
83

మెగా డాట‌ర్ నిహారిక పెళ్లి గురించి వార్త‌లు ఎప్పుడూ వ‌స్తూనే ఉంటాయి.. ఇక గతంలో ఆమె పెళ్లి గురించి అనేక వార్తలు వచ్చాయి.. మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇలాంటి వార్తలు వస్తే మెగా కాంపౌండ్ అస్సలు పట్టించుకోదు. వాటికి రిప్లై కూడా ఇవ్వదు, అయితే తాజాగా ఆమెకి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని భావిస్తున్నారట మెగా కుటుంబం. ఇప్పటి వరకూ పెళ్లికి నో చెప్పిన నిహారిక తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ముందు సినిమాలు చేసి హీరోయిన్ అవుదాము అనుకుంది, కాని అనుకున్నంత ఫేమ్ రాకపోవడంతో కాస్త సినిమాలకు దూరంగానే ఉంటోంది. బడా వ్యాపారాలు చేస్తున్న 2 పెద్ద కుటుంబాలకు చెందిన సంబంధాల్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు మెగా కుటుంబ సభ్యులు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ బిజినెస్ చేస్తున్న కుటుంబాలు అని తెలుస్తోంది.

ఇక గతంలో నాగబాబుకూడా తన కుతూరు పెళ్లి విషయంలో ఓ విషయం చెప్పారు. తను ఎప్పుడు పెళ్లి అంటే అప్పుడు చేస్తాం, మాకు కులాల పట్టింపులు కూడా లేవు అని చెప్పారు ఆయన.. . అన్నీ ఒకే అయితే వచ్చే ఏడాది సమ్మర్ లో నిహారికకి పెళ్లి చేస్తారట.