నిహారిక కి మాట ఇచ్చిన బాబాయ్ పవన్ కల్యాణ్ ఏమన్నారంటే

నిహారిక కి మాట ఇచ్చిన బాబాయ్ పవన్ కల్యాణ్ ఏమన్నారంటే

0
136

మెగా వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఇక కొద్ది రోజుల్లో నిహారిక వెడ్డింగ్ జరుగనుంది, కేవలం కుటుంబసభ్యులు మాత్రమే ఈ వివాహానికి హజరవుతారు, నిహారిక, చైతన్యల పెళ్లికి మూహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో జరగనుంది వీరి వివాహం.

అయితే ఈ వివాహానికి అల్లు కుటుంబం మెగా కుటుంబం చైతన్య కుటుంబం మాత్రమే హాజరు కానున్నారు, అయితే నాగబాబు కుటుంబం చిరంజీవి కుటుంబం ఆయన చెల్లెల్లు అందరూ హాజరు అవుతారు. మరి పవన్ కల్యాణ్ ఈ పెళ్లికి వెళతారా ఎప్పుడు వెళతారు అనేదానిపై అనేక వార్తలు వినిపించాయి.

తాజాగా టాలీవుడ్ మెగా అభిమానులు సమాచారం ప్రకారం తన అన్న మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహానికి తాను తప్పకుండా వస్తాను అని పవన్ చెప్పారట, అయితే రెండు రోజులు వచ్చే అవకాశం లేకపోయినా పెళ్లి సమయానికి అక్కడకు వస్తాను అని పవన్ చెప్పారట, స్పెషల్ ప్లైట్ లో ఆయన వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది, ఇక మూడు రోజుల ముందు మెగా కుటుంబం అక్కడకు వెళ్లనున్నారు అని తెలుస్తోంది, పవన్ కుటుంబం మాత్రం పెళ్లి రోజు అక్కడకు వెళతారు అని టాక్ వినిపిస్తోంది.