Niharika Konidela | విడాకులపై స్పందించిన నిహారిక, చైతన్య

-

విడాకుల విషయంపై ఎట్టకేలకు స్పందించారు మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela). కొంతకాలంగా ఆమె విడాకుల విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ తమ సోషల్ మీడియా ఖాతాల నుండి పెళ్లికి సంబంధించిన, వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు తొలగించారు. దీంతో వీరు విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయినప్పటికీ ఈ విషయంపై ఇటు నిహారిక, అటు చైతన్య(Chaitanya jonnalagadda) ఇద్దరు స్పందించలేదు. దీంతో వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ వీరి విడాకులకు సంబంధించి రకరకాల కథనాలు ప్రచురించాయి.

- Advertisement -

ఇటీవల జరిగిన వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ల ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కూడా చైతన్య అటెండ్ అవ్వకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో నిహారిక, చైతన్య విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో మే 19న దాఖలు చేసిన పిటిషన్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరి విడాకుల పై నెలకొన్న ఉత్కంఠకు తెర తొలగింది. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్న వార్తలు నిజమేననీ, ఊహాగానాలు కాదని క్లారిటీ వచ్చేసింది. దీంతో నిహారిక, చైతన్య లు విడాకుల విషయంపై స్పందించారు.

చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడాకులను తీసుకుంటున్నట్లు ఇంస్టాగ్రామ్ లో నిహారిక(Niharika Konidela) ప్రకటించారు. ఈ సున్నిత సమయంలో తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీని కోరుకుంటున్నామని, దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు నిహారిక కృతజ్ఞతలు తెలిపారు. చైతన్య కూడా ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో తెలిపారు.

Read Also: 

1. పూర్తైన నిహారిక కొణిదెల విడాకుల ప్రక్రియ.. ఇదిగో ప్రూఫ్
2. ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. స్త్రీలకు ఆ సమస్యలు!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...