హీరోల విషయంలో అభిమానులు ఏది జరిగినా చర్చే చేస్తారు, ఇప్పుడు మెగా కుటుంబంలో జరిగిన మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ద ఈవెంట్ కు, మెగా హీరోలు అందరూ వచ్చారు. కాని పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదు అనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.
అయితే ఇక్కడ చాలా మందికి తెలియంది ఏమిటి అంటే, పవన్ కల్యాణ్ ఉదయం వెళ్లి వారిని ఆశీర్వదించారట..అయితే, కేవలం ఫోటోల్లో మాత్రమే పవన్ కనిపించలేదు. ఉదయాన్నే నాగబాబు నివాసానికి వెళ్లిన ఆయన కాబోయే దంపతులను ఆశీర్వదించారట.
అయితే దీనికి కారణం ఉంది, ఆయన గత నెల చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. ఇది నాలుగు నెలలు కొనసాగే దీక్ష. ఈ దీక్షలో ఉన్న వారు సాయంత్రం ఆరు తరువాత ఇల్లు విడిచి వెళ్లకూడదన్న నిబంధన ఉంది. ఇక నిహారిక ఈవెంట్ రాత్రిపూట జరిగింది, సో అందుకే పవన్ ఈ కార్యక్రమానికి రాలేదు, కాని ఉదయమే వారిని ఆశీర్వదించారట.