Appudo Ippudo Eppudo | ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ ఎలా ఉందంటే..

-

నిఖిల్(Nikhil Siddhartha), రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) జంటగా నటించిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo)’. ఈ సినిమాకు సుధీర్ వర్మ(Sudhir Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని, థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని హీరో నిఖిల్ ధీమాగా చెప్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ మూవీ టీమ్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా కోసం మరింత ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే సినిమా ట్రైలరే ఒక సూపర్ ఫీల్ ఇచ్చిందని అంటున్నారు సినీ ప్రేమికులు. ఈ సినిమా సక్సెస్ పక్కా అని జోస్యం చెప్తున్న వారు కూడా ఉన్నారు. మరింతలా అందరినీ ఆకట్టుకుంటున్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ ఎలా ఉందో తెలుసా..

- Advertisement -

‘రేసర్ కావాలన్నది వీడి కల’ అంటూ హీరో నిఖిల్ అభిరుచులను చెప్తూ స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ నెక్స్ట్ ఫ్రేమ్‌లోనే హీరో లవ్ యాంగిల్‌ను కూడా టచ్ చేశాడు. అందుకోసం హీరో ఇద్దరు అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తాడు. ఒకరిని పెళ్ళి కూడా చేసుకుంటాడు. ఈ ప్రేమ నాటకం అంతా కూడా నిఖిల్ కేవలం డబ్బుల కోసమే చేస్తున్నట్లు ట్రైలర్‌లో చెప్పింది మూవీ టీమ్. అందుకే ‘రేసర్ కావడానికి డబ్బులు కావాలి కాబట్టి’ అన్న వాయిస్ ఓవర్ వెంటనే నిఖిల్ ప్రపోజల్ సీన్‌ను ఉంచారు. ఈ రెండిటిని చూపిన వెంటనే ‘డబ్బుల కోసం పార్ట్ టైమ్ కూడా ప్లాన్ చేసుకున్నాడు’ అని చెప్తూ ఈ సినిమా(Appudo Ippudo Eppudo)లో ఉండా యాక్షన్ ఎపిసోడ్‌ను టచ్ చేశాడు. వీటితో పాటు ఛేజింగ్‌లు, మైండ్ గేమ్‌లతో ట్రైలర్‌ను ఫుల్ ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో నింపేశారు. ఇందులో వైవా హర్ష, సత్య కాంబో కామెడీ వేరే లెవెల్లో ఉండనుందని కూడా మూవీ టీమ్ చెప్పకనే చెప్తోంది. మరి ఈ ట్రైలర్‌పై మీరు కూడా ఒక లుక్కేయండి.

Read Also: భారీ రెమ్యునరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన తాప్సీ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...