నిన్న ఈ తప్పు చేశా కావాలని కాదు అనిల్ రావిపూడి- ట్వీట్

నిన్న ఈ తప్పు చేశా కావాలని కాదు అనిల్ రావిపూడి- ట్వీట్

0
81

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ వేడుక నిన్న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో చాలా అద్బుతంగా జరిగింది,, ఈకార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హజరు అయ్యారు.. ఇక విజయశాంతి చిరు మధ్య జరిగిన సంభాషణలు, వారు ఇచ్చిన స్పీచ్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి, చాలా రోజుల తర్వాత చిరు విజయశాంతి కలవడంతో నవ్వుతూ పలకరింపులు చేసుకున్నారు, ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కూడా పలు కీలక విషయాలు తెలిపారు.

తనకు కుమారుడు ఈరోజు పుట్టాడు అని చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు, తను మెగాస్టార్ అభిమానిని ఆయన డ్యాన్సులు చూసి డ్యాన్స్ నేర్చుకున్నా, అలా డైరెక్టర్ అయ్యా అన్నారు, అయితే నిన్న మాట్లాడిన మాటల్లో తను ఒక వ్యక్తి గురించి చెప్పలేదు అని .. తన తొలి హీరో కల్యాణ్ రామ్ పేరును చెప్పడం మర్చిపోయాను అని చెప్పారు దర్శకుడు అనిల్.

తాను చేసిన పొరపాటుకు ఈరోజు ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. తన తొలి హీరో కల్యాణ్ రామ్ పేరు చెప్పడం మర్చిపోయామని అనిల్ రావిపూడి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నిన్న చాలా ఎమోషనల్ గా ఉన్నానని చెప్పారు. ప్రీరిలీజ్ వేడుకలో చాలా సంతోషానికి లోనయ్యానని… దీంతో, తన తొలి హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ పేరును చెప్పడం మర్చిపోయానని తెలిపారు. కల్యాణ్ రామ్ తాజా చిత్రం ఎంత మంచివాడవురా సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నారు ఆయన.