నితిన్ ఆ దర్శకుడితో సినిమా చేయనున్నారా ? టాలీవుడ్ టాక్ ?

నితిన్ ఆ దర్శకుడితో సినిమా చేయనున్నారా ? టాలీవుడ్ టాక్ ?

0
125

కిక్ ఎవడు రేసుగుర్రం టెంపర్ ఈ హిట్ చిత్రాలకు కధలు అందించిన వ్యక్తి వక్కంతం వంశీ.. అద్బుతమైన రైటర్

యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఈ కథలను తనదైన శైలిలో అద్బుతంగా రాస్తారు, ఇక యూత్ కి బాగా నచ్చే స్టోరీలు రాసే రైటర్ అనే పేరు ఉంది, ఇక మాస్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్నా రైటర్ ఆయన.

 

గతంలో అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను తెరకెక్కించారు . అయితే తాజాగా ఆయన నితిన్ తో ఓ సినిమా చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ అంధాదున్

రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి మాస్ట్రో అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు… సో ఈ సినిమా పూర్తి అయ్యాక వంశీ చిత్రం ఉండవచ్చు అని టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది.

 

మొత్తానికి నితిన్ మంచి ఫామ్ లో ఉన్నారు.. ఇక ఇలాంటి సమయంలో సూపర్ స్టోరీతో వంశీ సినిమా వస్తే నితిన్ తో పాటు దర్శకుడికి కూడా మంచి హిట్ పడినట్టే…. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు చూడాలి మరి.