నితిన్ సినిమాలో ఆ హీరోయిన్ పేరు పరిశీలన – టాలీవుడ్ టాక్

నితిన్ సినిమాలో ఆ హీరోయిన్ పేరు పరిశీలన - టాలీవుడ్ టాక్

0
72

సౌత్ ఇండియాలో హీరోయిన్ సాయిపల్లవికి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే… స్టోరీ బాగోవాలి తన పాత్ర తనకి నచ్చాలి లేకపోతే ఆమె సినిమా చేయదు, ఎంత రెమ్యునరేషన్ ఇస్తాను అన్నా ఆమెకి స్టోరీ నచ్చకపోతే సినిమాలు ఆమె చేయరు. అందుకే ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలు అన్నీ హిట్.

 

ఇక ప్రేమమ్ సినిమాతో ఆమె తెలుగుప్రేక్షకులకి బాగా దగ్గర అయింది. ఇక మంచి డ్యాన్సర్ అలాగే ఫిదా సినిమాతో మంచి పేరు గుర్తింపు సంపాదించింది. ఇక తాజాగా ఆమె హీరో నితిన్ తో సినిమా చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, టాలీవుడ్ టాక్ అయితే నడుస్తోంది.

 

మ్యాస్ట్రో సినిమాలో నటిస్తోన్న నితిన్ తన తర్వాతి చిత్రాన్ని వక్కంతం వంశీతో చేయనున్నట్లు టాలీవుడ్లో టాక్. ఇది మంచి లవ్ స్టోరీ అని తెలుస్తోంది ఇందులో సాయిపల్లవిని సంప్రదిస్తున్నారనే వార్తలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.