పెళ్లికి ముందే నితిన్ గొప్ప నిర్ణయం 60 ఏళ్ల వృద్దుడిగా

పెళ్లికి ముందే నితిన్ గొప్ప నిర్ణయం 60 ఏళ్ల వృద్దుడిగా

0
71

నితిన్ గురించి ఈ మధ్య బాగా పెళ్లి గురించి వార్తలు వినిపించాయి, తాజాగా నితిన్ భీష్మ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.. ఈనెల 21న భీష్మతో శివరాత్రికి ప్రజల ముందుకు వస్తున్నాడు.. అయితే డిఫరెంట్ టైటిలే కాదు సినిమా కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని అంటున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. పాటల రచయితగా పరిచయమైన కృష్ణ చైతన్య, ఆ తరువాత దర్శకుడిగా మారి ఛల్ మోహన్ రంగా తీశారు, కాని అది అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు. అయితే ఈ సమయంలో మరోసారి ఆయనతో సినిమా చేయాలని రెడీ అయ్యాడు.

నితిన్ కృష్ణ చైతన్య సినిమాకి పవర్ పేట అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల కుర్రాడిగా .. 40 ఏళ్ల యువకుడిగా .. 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నాడట. అయితే ఈ సినిమా కథ బాగా నచ్చిందట, అందుకే సొంత బ్యానర్లో చేస్తున్నారట… రెండు లేదా మూడు పార్ట్ లుగా ఈ సినిమా వస్తుందట మరి చూడాలి నితిన్ కొత్త ప్రయోగం ఎలా ఉంటుందో.