నితిన్ కు బంపర్ ఆఫర్ అదరగొడుతున్నాడుగా

నితిన్ కు బంపర్ ఆఫర్ అదరగొడుతున్నాడుగా

0
101

నితిన్ మంచి జోష్ మీద సినిమాలు చేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.. అంతేకాదు మూడు చిత్రాలు షూటింగ్ కూడా జరుపుకుంటున్నాయి ..ఇక తాజాగా బీష్మ చిత్రం షూటింగ్ పూర్తి అవుతోంది.
వెంకీ అట్లూరి రంగ్ దే సినిమా ఓ షెడ్యూలు ఫినిష్ చేసుకుంది. చంద్రశేఖర్ యేలేటి చదరంగం సినిమా సగానికి పైగా పూర్తయింది.

తాజాగా ఎప్పటి నుంచో అనుకుంటున్న మరో ప్రాజెక్టు ను ఈ రోజు ఫైనల్ చేసారు.దర్శకుడు కృష్ణచైతన్య తయారుచేసిన పవర్ పేట స్క్రిప్ట్ ను నితిన్ చేయబోతున్నారు. దీనికి నితిన్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా సంస్ధ నిర్మాతగా రంగంలోకి వస్తోంది.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం పవర్ పేట సబ్జెక్ట్ ను రెండు భాగాలుగా తయారు చేసారు. ఫిబ్రవరి నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా తరువాత తన స్వంత బ్యానర్ మీద అంథాదూన్ రీమేక్ ను స్టార్ట్ చేస్తాడు నితిన్. సో నితిన్ చేతిలో వచ్చే ఏడాదికి ఏకంగా ఐదు సినిమాలు ఉన్నట్లే.