టాలీవుడ్ లో బ్యాచిలర్స్ హీరోలు చాలా మంది ఉన్నారు ..వారిలో నితిన్ కూడా ఒకరు, ఇలా 35 సంవత్సరాలు దాటిన హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే నితిన్ పెళ్లి గురించి గతంలో చాలా వార్తలు వచ్చాయి ..కాని ఇటీవల మాత్రం ఆయన పెళ్లిపై ఎలాంటి వార్తలు వినిపించలేదు.
దాదాపు పదిహేడేళ్ల కిందట నితిన్ సినిమా కెరీర్ మొదలైంది. ఇప్పటి వరకూ ఇతడు బ్యాచిలర్ గానే ఉన్నాడు.
అయితే పెళ్లి గురించి కూడా మీడియా ఆయనని ఎప్పుడూ ప్రశ్నించినా ఆయన ఆ విషయం దాటవేస్తాడు. ఇప్పుడు కెరియర్ కూడా నితిన్ స్పీడు పెంచాడు.. దీంతో నితిన్ పెళ్లి చేసుకుంటున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన పెళ్లిపై ఓ గాసిప్ కూడా వినిపించింది.
తనతో సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ తో పెళ్లి జరుగుతుందని, నితిన్ ఆమెని ప్రేమిస్తున్నాడు అని వార్తలు వినిపించాయి. అయితే సినిమాలు కూడా రెండు వరుసగా చేసే సరికి టాక్ పెరిగింది కాని అది కొట్టిపారేశారు.
తాజాగా నితిన్ ఒక తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆ అమ్మాయి ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో విదేశాల్లో నితిన్ పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది.2020లో మార్చిలోపు నితిన్ పెళ్లి జరుగుతుంది అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.