యాంకర్ అనసూయను కలవనున్న నితిన్ దేనికంటే

యాంకర్ అనసూయను కలవనున్న నితిన్ దేనికంటే

0
92

హీరో నితిన్ వరుసగా ఇప్పుడు సినిమాలు సెట్స్ పై పెడుతున్నారు, భీష్మ సినిమా హిట్ తో మంచి ట్రాక్ లో ఉన్నాడు అనే చెప్పాలి, అంతేకాదు ఓ వైపు హీరోగా ఉంటూనే నిర్మాతగా కూడా మారారు.. తాజాగా తన బ్యానర్ పై ఆయన అంధదూన్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది క్రియేటీవ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ,ఇక హిందీలో టబు ఓ ముఖ్యపాత్రలో నటించారు, అయితే ఆ పాత్ర సినిమాలో ఆమెకి మంచి పేరు తెచ్చింది..తెలుగులో ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నటుగా వార్తలు వచ్చాయి.

ఇక టబు పాత్ర కోసం ఇప్పుడు యాంకర్ అనసూయను నితిన్ టీమ్ కలిసింది అని తెలుస్తోంది, ఆ పాత్రకు యాంకర్ అనసూయ న్యాయం చేస్తుంది అంటున్నారు.. తాజాగా ఈ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మూడు చిత్రాలు ఒకే చేసిన అనసూయ తాజాగా ఈ చిత్రం కూడా సైన్ చేస్తే నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నట్లే.