నితిన్ టైటిల్ ‘రంగ్ దే’..!!

నితిన్ టైటిల్ 'రంగ్ దే'..!!

0
113

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ 29వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఫిక్సయింది. ‘రంగ్ దే !’ పేరు పెట్టారు. #gimmesomelove అనేది ట్యాగ్ లైన్. కొద్దిసేపటి క్రితమే చిత్రబృందం టైటిల్ పోస్టర్ ని విడుదల చేసింది. 2020 వేసవిలో సినిమా విడుదల ఉండనుందని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో నితిన్ జంటగా కీర్తి సురేష్ నటించనుంది. ఈ చిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. నితిన్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో నితిన్ మళ్లీ హిట్ ట్రాక్ వస్తాడా ? అనేది చూడాలి.