కొత్త సినిమా స్టార్ట్ చేసిన నితిన్

కొత్త సినిమా స్టార్ట్ చేసిన నితిన్

0
106

భీష్మ సినిమాతో మ‌న ముందుకు వ‌చ్చాడు నితిన్, తాజాగా ఆయ‌న క‌ల నెర‌వేరింది ఎందుకు అంటే ఈ ఏడాది హిట్ కొట్టాలి అని చూశాడు ఈ సినిమా హిట్ టాక్ వ‌చ్చింది… ఇక తాజాగా ఆయ‌న మ‌రో కొత్త సినిమాని లాంచ్ చేశారు, కొంత కాలం హిందీలో వ‌చ్చిన అంద‌ధూన్ సినిమా కి ఇది రీమేక్ గా వ‌స్తోంది.

ఇక ఈ సినిమా న‌చ్చి ఆయ‌న హిందీ హ‌క్కులు తీసుకున్నాడు… సొంత బ్యాన‌ర్లో ఈ సినిమా రీమేక్ చేస్తున్నాడు ఇక ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తున్నారు నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వగా .. ‘దిల్’ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు

సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నితిన్ .. రంగ్ దే.. చెక్ నిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలుపూర్తయిన తరువాతనే, ఈ చిత్రం స్టార్ట్ చేస్తార‌ట‌,ఈ ఏడాది నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది అని అంటున్నారు..