నితిన్- రష్మిక మందన్న కొత్త సినిమా మొదలు..!!

నితిన్- రష్మిక మందన్న కొత్త సినిమా మొదలు..!!

0
123

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – రష్మిక మందన్న జంటగా భీష్మ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది . శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు . వరుసగా నితిన్ చేస్తున్న సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో పది నెలల అనంతరం ఈ భీష్మ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పై వుండవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన పట్టాలెక్కడం ఆలస్యమైంది. ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఈ ప్రేమకథా చిత్రంలో నితిన్ సరసన నాయికగా రష్మిక నటించనుంది. కొంతకాలంగా నితిన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. కథపై నమ్మకంతో ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నాడు. ఇక నుంచి నితిన్ అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.