యంగ్ హీరో నితిన్(Nithin), వెంకీ కుడుముల(Venky Kudumula) కాంబోలో వస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్(Robin Hood)’. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఇందుకు తగిన సన్నాహాలు చేయడం కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది.
‘రాబిన్ హుడ్’ రిలీజ్‌ను వాయిదా వేయాలని నిశ్చియించుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ తన పోస్ట్‌లో పేర్కొంది. అతి త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
అయితే నితిన్, వెంకీ కాంబోలో వస్తున్న రెండు సినిమా ఇది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగమేఘాలపైన షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది ‘రాబిన్ హుడ్’. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కూడా చిత్ర బృందం షూటింగ్ అప్‌డేట్ ఇచ్చింది.
అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్లే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా(Robin Hood) షూటింగ్‌కు సంబంధించి ఇంకా ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని, దాని వల్లే సినిమా ఆలస్యమైనట్లు సమాచారం. ఇదిలా ఉంట ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. మరి అదే రేంజ్ వసూళ్లను చేస్తుందో లేదో చూడాలి.