టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘భీష్మ’ సినిమానే నితిన్ హిట్ ఖాతాలో ఉంది. ఆ తర్వాత వచ్చిన రంగ్‌దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో నాలుగేళ్లుగా హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తనకు గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీని నిర్మించేందుకు ‘హనుమాన్’ సినిమా నిర్మాత కూడా ముందుకు వచ్చారట.
2012 ముందు వరకు నితిన్(Nithin) కెరీర్ పూర్తి డైలమాలో పడింది. ఇక కెరీర్ అయిపోయిందనుకున్న తరుణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్క్’ సినిమా యువతను విపరతీంగా ఆకట్టుకుని మనోడికి సూపర్ హిట్ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో వరుస హిట్లు అందుకుని దూసుకెళ్లాడు. ప్రస్తుతం కూడా వరుస ఫ్లాపులతో ఉన్న తనకు హిట్ ఇచ్చిన విక్రమ్ డైరెక్షన్‌లో మూవీ చూసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వెంకీ కుడుమల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ మూవీతో పాటు వేణుశ్రీరాంతో ‘తమ్ముడు’ సినిమాలోనూ హీరోగా చేస్తున్నాడు.