నితిన్ వివాహం ఎప్పుడంటే

నితిన్ వివాహం ఎప్పుడంటే

0
89

టాలీవుడ్ లో వివాహాల జోరు క‌నిపిస్తోంది… ఇప్ప‌టికే రానా వివాహం డేట్ ఫిక్స్ అయింది. అయితే ఇప్పుడు నితిన్ కు కూడా వివాహం అవుతున్న విష‌యం తెలిసిందే..హీరో నితిన్ కు ఫిబ్రవరి 15న హైదరాబాద్ లో షాలిని అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది.

నితిన్ వివాహం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎప్రిల్ 16న నిఖిల్ పెళ్లి కోసం ముహూర్తం పెట్టుకోగా కరోనా విజృంభణతో వాయిదా వేసుకున్నారు. పెళ్లి కోసం దుబాయ్ లో భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. టాలీవుడ్ పెద్ద‌ల‌ని పిలుద్దాము అని అనుకున్నారు, కాని లాక్ డౌన్ తో మొత్తం క్యాన్సిల్ అయింది.

ప్రస్తుతం లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో నితిన్ వివాహం వచ్చే నెలలో చేసే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారట. ఇదివరకు డిసెంబర్ లో నితిన్ వివాహం అని వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెలలోనే నితిన్ పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇక జూలై లో ఉన్న ముహూర్తంలో ఒక‌టి ఫిక్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.