నిత్యామీనన్ సంచలన కామెంట్స్..ఆరేళ్ల పాటు వేధింపులు అంటూ..

0
96

హీరోయిన్ నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. సెలబ్రిటీస్‌ ఇందుకు అతీతం కాదు. హీరోయిన్​ నిత్యామేనన్‌ కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నారట.

తాజాగా ఈ భామ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంది. తనను ఒక వ్యక్తి ఆరేళ్లపాటు వేధింపులకు గురి చేశాడని చెప్పింది. నటుడు మోహన్‌లాల్‌ ఆరాట్టు సినిమా పేరుపై విశ్లేషణ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన సంతోష్‌ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది.

చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది.