పెళ్లి రూమర్స్​పై స్పందించిన నిత్యా మీనన్..ఏమన్నారంటే?

0
111

స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ అలా మొదలైంది, ఇష్క్, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సాంపాదించుకుంది. తాజాగా ఈ హీరోయిన్ కు సంబంధించి ఓ వార్త న్యూస్​ వెబ్​సైట్లలో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని, త్వరలో వీరు పెళ్లి పీటలు కూడా ఎక్కరున్నారనే వార్తపై నిత్యామీనన్ స్పందించారు. తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై అందరికి ఓ క్లారిటీ ఇచ్చారు. “నా పెళ్లి గురించి ఇటీవల వచ్చిన వార్తలో నిజం లేదు. అదంతా కల్పితం” అని నటి నిత్యా మీనన్‌ నేరుగా సోషల్​మీడియా వేదికగా స్పష్టం చేశారు.

అంతేకాకుండా వివాహం గురించి ప్రస్తుతానికి తనకెలాంటి ఆలోచన, ప్రణాళిక లేవని తెలిపారు. ఎవరో ఓ వ్యక్తి తాను ఊహించుకుని ఓ ఆర్టికల్‌ రాస్తే దాన్ని ఎలాంటి ఆధారాల్లేకుండా అంతా దాన్ని వ్యాప్తి చేశారన్నారు. ఇదిలా ఉండే..నిత్య త్వరలో 19(1)(a) అనే సినిమాతో సందడి చేయనున్నారు.