ఇక గొడవలొద్దు..ఆపేయండి: మోహన్ బాబు

No more fighting..Stop: Mohan Babu

0
78

మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.  విష్ణును ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇక నుంచి ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా చూసుకుంటామని తెలిపారు. జరిగిందేదో జరిగింది అని, అందరం ఒకే కుటుంబం అని మోహన్‌బాబు అన్నారు.

ఇది ఏ ఒక్కరి విజయం కాదు. 800లకు పైగా ఉన్న ‘మా’ సభ్యుల విజయం అని పేర్కొన్న మోహన్ బాబు.. ఇది ఆనందం అనుకోవడం కరెక్ట్‌ కాదని అన్నారు. ఎన్నికల్లో భయంకరమైన వాగ్దానాలు చేశారని, తన బిడ్డ అన్నీ నెరవేర్చుతారని చెప్పారు. జరిగిందేదో జరిగింది.. ఇక నుంచి అందరం ఒక తల్లి బిడ్డలం అనుకోవాలని పేర్కొన్నారు. ఇక నుంచి వివాదాలకు దూరంగా ఉందామని పిలుపునిచ్చారు. అధ్యక్షుడికి చెప్పకుండా ఎవరూ మీడియా ముందుకు వెళ్లవద్దని గెలిచిన సభ్యులకు మోహన్ బాబు సూచించారు.