నూత‌న్ నాయుడు మ‌రో మోసం ఏకంగా 12 కోట్ల‌కు డీల్

నూత‌న్ నాయుడు మ‌రో మోసం ఏకంగా 12 కోట్ల‌కు డీల్

0
136

బిగ్ బాస్ ఫేమ్ సినిమా నిర్మాత నూత‌న్ నాయుడు ఇంట్లో కొన్ని రోజుల క్రితం
దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే, ఈకేసులో ఇప్ప‌టికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు, అంతేకాదు నూత‌న్ నాయుడిని ఉడిపిలో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక ఆయ‌న బెదిరింపు లీల‌లు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి, పైకి బాగానే క‌నిపించినా నూత‌న్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌కు వ‌స్తోంది..ఇప్పటికే మాజీ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ పేరిట బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. దీనిపై కేసు న‌డుస్తోంది విచార‌ణ చేస్తున్నారు పోలీసులు.

ఇక నూతన్‌పై మరో రెండు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి బ్యాంకులో డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ రూ. 12 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. మరోవైపు.. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నాలుగు లక్షలు వసూలు చేసినట్లు కూడా తేలింది. దీంతో అత‌ను చాలా పెద్ద సెటిల్మెంట్ లు న‌డిపాడు అని తెలుస్తోంది, అయితే నాలుగు ల‌క్ష‌లు ఇచ్చినా ఉద్యోగం రాలేదు దీంతో నూత‌న్ ని ప్ర‌శ్నిస్తే అత‌ను డ‌బ్బులు ఇచ్చిన వ్య‌క్తిని ఇష్టం వ‌చ్చిన‌ట్లు దుర్భాష‌లాడారు, దీంతో ఆ వ్య‌క్తి కేసు ఫైల్ చేశాడు..ఇప్పుడు ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు వ‌స్తూ నూత‌న్ నాయుడు చేసిన వాటిపై కేసులు పెడుతున్నారు.