సినిమా పరిశ్రమలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్ మహారాజ్ రవితేజ, బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రికార్డులు నమోదు చేశాయి.. అయితే తాజాగా ఓ వార్త గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.. ఎందుకు అంటే ముందు రవితేజ దర్శకత్వ శాఖలో చేశారు, తర్వాత చిన్న చిన్న వేషాలు వేశారు, తర్వాత హీరో అయ్యారు.
హీరోగా టాప్ పొజిషన్ కి చేరిన రవితేజ మనసులో దర్శకత్వం వహించాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. తాజాగా ఈ విషయాన్ని తెలిపారు ఆయన, క్రాక్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది, ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ ఆయన పాల్గొంటున్నారు.
తాజాగా ఆయన ఈ విషయం తెలిపారు ఇంటర్వ్యూలో …దర్శకత్వం చేసే అవకాశం ఉందా? అని ఛానల్ యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పారు రవితేజ, ఉన్నాయి అని అన్నారు, అయితే రాబోయే రోజుల్లో దర్శకుడిగా కూడా మన మాస్ మహారాజ్ ని చూడచ్చు అంటున్నారు అభిమానులు.
.