నా సినిమా ఆపేందుకు చూస్తున్నారు

నా సినిమా ఆపేందుకు చూస్తున్నారు

0
113

అర్జున్ రెడ్డి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ‌రీన్ న‌టించిన చిత్రం `నోటా`. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. అక్టోబ‌ర్ 5న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన నోటా ప‌బ్లిక్ మీట్‌లో…

విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ – `ఈ సినిమా రిలీజ్ ను ఆపేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. ఎన్నికల సమయంలో సినిమా వస్తుండటంతో, నోటా టైటిల్ వ‌ల్ల ప్ర‌జ‌లంద‌రూ నోటా బ‌ట‌న్ నొక్కుతారేమో అని.. ఈ సినిమా ఓ పార్టీకి ఫేవ‌ర్‌గా ఉంది.. దీన్ని ఆపాల‌ని కొంత‌మంది కేసులు పెట్టారు. మేం నోటా బ‌ట‌న్ నొక్కాల‌ని చెప్ప‌డం లేదు.. ఏదో ఒక పార్టీకీ ఫేవ‌ర్‌గా లేం. అయితే యంగెస్ట్ సీఎం ఆఫ్ హిస్ట‌రీని సినిమాలో చూస్తారు. ప‌వ‌ర్ అనేది వాళ్ల‌లో.. వీళ్ల‌లో లేదు. మ‌న‌లోనే ప‌వ‌ర్ ఉంది. ఈ స్టేడియంలో ఉన్న‌వాళ్లంద‌రూ అనుకుంటే ఎల‌క్ష‌న్స్‌ని ప్ర‌భావితం చేయాలేమా? ఒక మంచి చేయాల‌నుకుంటే చేయ‌లేమా? యువ‌తలో ప‌వ‌ర్ ఉంది. మ‌న‌కు ఎవ‌రు ఆడ్మిన‌స్ట్రేష‌న్ మంచిగా చేస్తున్నారో ఆలోచించి వాళ్ల‌కే ఓటు వేద్దాం. అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌బోతున్నాను. కంప్లీట్ కొత్త పొలిటికల్ జోన‌ర్‌లో సినిమా ఇవ్వ‌బోతున్నాను. అక్టోబ‌ర్ 5న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం“ అన్నారు.