మరో బిగ్ డీల్ చేసుకోబోతున్న జూనియర్ ఎన్టీఆర్

మరో బిగ్ డీల్ చేసుకోబోతున్న జూనియర్ ఎన్టీఆర్

0
42

బిగ్ బాస్ తెలుగులో ఇక మూడు సీజన్లు పూర్తి అయ్యాయి ఇక నాల్గవ సీజన్ కు బ్యాగ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోంది అని తెలుస్తోంది అయితే ముందు నుంచే పక్కా ప్లాన్ ప్రకారం ఈ టీమ్ వెళుతూ ఉంటారు, అయితే అక్కడ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా దీనిని చేస్తున్నారు.. ఇలా టాలీవుడ్ లో నడిపించే హోస్ట్ కోసం ఇప్పుడు మళ్లీ వెతుకులాట చేస్తున్నారు బిగ్ బాస్ టీం అని తెలుస్తోంది.

తెలుగులో మూడు సీజన్స్ కి ముగ్గురు హోస్ట్ లు మారారు. ఎన్టీఆర్, నాని, నాగార్జున తో మూడో సీజన్ ముగిసింది. అయితే బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఈసారి స్టార్ హీరోని తీసుకుని బిగ్ బాస్ సీజన్ 4 ని స్ట్రాంగ్ గా లీకులు లేకుండా, నడిపించాలి అని చూస్తోంది, అంతేకాదు ఒకసారి తీసుకున్న హోస్ట్ ని మళ్లీ తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఉంది. అందుకే మరోసారి సీజన్ 4 కి ఎన్టీఆర్ ని తీసుకోవాలి అని భావిస్తున్నారట

అయితే ఎన్టీఆర్ కూడా RRR షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ నాటి కల్లా ఫ్రీ అవుతాడని వారికి తెలుసు , అందుకే జూలైలో ఈ షో స్టార్ట్ చేద్దాము అని వారు కోరుతున్నారట, అంతేకాదు గతంలో ఇచ్చిన పారితోషికానికి భారీగా ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు బిగ్ బాస్ టీం. మరి ఎన్టీఆర్ ఏం చేస్తారో చూడాలి, అభిమానులు మాత్రం హోస్ట్ చేయాలి అని కోరుతున్నారు.