కొత్త దర్శకుల కధలు కూడా చాలా మంది హీరోలు వింటున్నారు, ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది కొత్త కధలు విన్నారు, వారి కధలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇక కొన్ని వచ్చే ఏడాది ప్రధమార్ధంలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇక కొత్త దర్శకుల కధలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి, అందుకే కేసీఆర్ హీరోలు ఆ కథలకి ఇంప్రస్ అవుతున్నారు, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ కధకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
హిట్’ చిత్రాన్ని చేసి, హిట్ చేసిన శైలేశ్ కొలను ఇప్పుడు ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టు చెబుతున్నారు. శైలేశ్ తాజాగా ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పారట, ఈ కథ నచ్చడంతో ఆయన ఒకే చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ సమాచారం ప్రకారం నిర్మాత దిల్ రాజు ఈచిత్రం నిర్మించే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తిచేస్తున్న ఎన్టీఆర్, తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు.. ఈ సినిమా తర్వాత శైలేజ్ సినిమా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది , ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.