ఎన్టీఆర్ కొత్త మూవీ గురించి అప్ డేట్ వచ్చేసింది…

ఎన్టీఆర్ కొత్త మూవీ గురించి అప్ డేట్ వచ్చేసింది...

0
84

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నాడు… ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు… ఇందరు స్టార్స్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈచిత్రం కోసం ఇటు చరణ్ అభిమానులు అలాగే అటు ఎన్టీఆర్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు… వాస్తవానికి ఈసినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది…

కానీ కారోనా కారణంగా ఇంకా షూటింగ్ కూడా పూర్తికాలేదు… ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్నారు… లాక్ డౌన్ సమయంలో దర్శకుడు పూర్తి స్థాయిలో కథను రెడీ చేసుకున్నారు.. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ముమ్మరంగా చేస్తున్నారు..

ఈ చిత్రం ఎన్టీఆర్ 30వ చిత్రం కావడంతో అభిమారులు ఈ ప్రాజెక్ట్ అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు… తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతల్లో ఒక్కరైన వంశీ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు… షూటింగ్ ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు ప్రతీ ఒక్కటీ వెళ్లడిస్తామని చెప్పాడు… అప్పటివరకు సినిమా టైటిల్ ప్రకటించకూడదన్నది తమ సెంటిమెంట్ అని చెప్పాడు…