కేజీఎఫ్ ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే, దేశంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాగా మంచి గుర్తింపుతో పాటు అవార్డులు సాధించింది, అయితే ఇక్కడ ఈ సినిమా తెరకెక్కించిన
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అవకాశాలు అలాగే వస్తున్నాయి, ప్రస్తుతం
కేజీఎఫ్ -2 తెరకెక్కుతోంది.
అయితే ఆయన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా ఫిక్స్ అయ్యారు, ఇది కూడా పాన్ ఇండియా చిత్రం అని తెలుస్తోంది …దీనిని మైత్రీ మూవీస్ నిర్మించనుంది అని వార్తలు వచ్చాయి, కాని దీనిపై ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు,. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఆయనకు ప్రశాంత్ నీల్ శుభాకాంక్షలు చెప్పడం ఆయనని పొగడటం చూసి సినిమా పక్కా అని అందరూ భావించారు..
ఇక ప్రశాంత్ బర్త్ డే జరిగింది, ఈ సమయంలో మైత్రీ మూవీస్ ఆయనకు ట్వీట్టర్ ద్వారా విషెస్ చెప్పింది.దీంతో ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా ఉంటుందని తేలింది, అందుకే మైత్రీ కూడా ఆయనకు విషెస్ చెప్పింది అంటున్నారు టాలీవుడ్ పెద్దలు.