బింబిసార సినిమాలో అన్న‌య్య కోసం రంగంలోకి తార‌క్ ?

NTR Role in Bimbisara Movie

0
98

కల్యాణ్ రామ్ డిఫ‌రెంట్ స్టోరీలు తీసుకుంటారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటారు. ఎన్టీఆర్ – క‌ల్యాణ్ రామ్ ఇద్ద‌రూ కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఈసారి స‌రికొత్త ప్ర‌యోగం చేస్తున్నారు క‌ల్యాణ్ రామ్.

చారిత్రక నేపథ్యంలో కూడిన బింబిసార కథను ఆయన తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ పెద్ద‌లు కూడా ఇది నిజంగా సాహ‌స‌మే అంటున్నారు. చాలా మంది ఈ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకుంటున్నారు. వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారాయ‌న‌. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమా విష‌యంలో తార‌క్, క‌ల్యాణ్ రామ్ కు ఎంతో సాయం చేస్తున్నార‌ట‌.
కల్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్ కూడా కథను విన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌నున్నారు అనే వార్త‌లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. సినిమాకి ఓ హైలెట్ సీన్ లో, ఈ చిత్రానికి క‌థ మ‌లుపు తిరిగే స‌మయంలో తారక్ వాయిస్ వ‌స్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.