త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే

త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే

0
83

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారు.. చరణ్ తో కలిసి షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు, వచ్చే ఏడాది ఈసినిమా రానుంది, అయితే తర్వాత బ్యాక్ టూ బ్యాక్ గా త్రివిక్రమ్ తో ఓసినిమాని తారక్ ప్లాన్ చేస్తున్నారు,
ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత మరో సినిమాని కాకుండా ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

అరవింద సమేతలో ఎన్టీఆర్ ను కొత్త కోణంలో చూపించిన త్రివిక్రమ్, ఈ సినిమాలో ఆయనను పక్కింటి అబ్బాయి పాత్రలో చూపించనున్నాడని అంటున్నారు. అవును సరికొత్త పాత్రలో తారక్ అభిమానులకి కనిపించనున్నారట, ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ రిలేషన్స్ తో త్రివిక్రమ్ సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే..

ఇక మాటల మాంత్రికుడు అప్పుడు ఫ్యామిలీ డైలాగ్స్ కూడా రాయడం స్టార్ట్ చేశారట, తారక్ మే నుంచి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు రెస్ట్ ఇస్తారట, జూన్ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. హారిక అండ్ హాసినివారితో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి, అన్న కల్యాణ్ రామ్ అంగీకరించాడని సమాచారం. మరి తారక్ అభిమానులకి మరో పండుగే అని చెప్పాలి.