తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత రూపొందిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్… ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ లు నటిస్తున్నారు… అల్లూరి శీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా కోమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు…
ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే … ఈ టీజర్ లో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడంతో అంచనాలు భారీగా పెంచుతున్నాయి… ఇప్పుడు ఎన్టీఆర్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ వీరికి గుడ్ న్యూ స్ చెప్పింది…
ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ టీజర్ ను విడుదల చేసింది…
వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి.. అంటూ చెర్రీ వాయిస్ తో ఉన్న ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్ అదుర్స్ అనిపిస్తోంది. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం అంటూ చరణ్ ఈ పాత్రను పరిచయం చేశాడు. పులిలా పోరాటానికి ఎన్టీఆర్ టీజర్ దూసుకెళ్తున్నాడు.